థానే: మహారాష్ట్రలోని థానేలో భగవాన్ అనే వ్యక్తి నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్వా ప్రాంతంలోని ఓ బ్రిడ్జికి తాడుకట్టి మెడలో తాడు వేసుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు నివ్వెరపోయారు. వెంటనే అతన్ని గమనించిన థానే ట్రాఫిక్ పోలీసులు చురుగ్గా స్పందించి.. అతన్ని కాపాడారు. స్థానికుల సహాయంతో సురక్షితంగా కిందకు దించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డు మీద ఉరేసుకొని చనిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు భగవాన్ అని, కొడుకు చనిపోయిన దగ్గరి నుంచి అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది.
నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే..!