విజయవాడ : సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలు బయటపడ్డాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు ముందు నుంచి వివాదాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌ను మానేజ్ చేసి చంద్రబాబు కుట్రలు పన్నారని విమర్శించారు. నిమ్మగడ్డ పేరుతో వచ్చిన లేఖలో చంద్రబాబు అభిప్రాయాలే స్పష్టంగా కనిపిస్తున్నాయని, చంద్రబాబు ఆక్రోశం, రాజకీయ దురుద్దేశం లేఖలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. (పచ్చ మీడియాకు లెటర్ ఎందుకు పంపారు!)
‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’