ఉపాధి హామీతో గ్రామీణ కూలీలకు ప్రభుత్వ భరోసా

 అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణ‌లో భాగంగా అమల‌వుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల‌ పనులు లేక అల్లాడుతున్న పేదల ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వేతనాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రధానంగా ఉద్యాన పంటలు, మల్బరీ తోటల పెంపకం, పశు గ్రాస పెంపకం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వ‌గా, దీనితో పాటు కాలువలు, చెరువుల తవ్వకం వంటి ఇతర సామాజిక పనులను స్థానిక డిమాండ్ ఆధారంగా చేపట్టాలని అధికారులు నిర్ధేశించారు.